మేము భారతీయులం అందులో కళింగ ఓ స్పూర్తి పదం . మరి ఓ పురాతన రాజ్యం కూడా మహా భారత కాలంలో వైతరణి నది మొదలుకొని ఉన్న ప్రాంతమంతా కళింగ దేశమని వ్యవహరించేవారు . ఇది ఉత్తర భారతదేశ ప్రాంతం . దక్షిణంలో గోదావరి నది వరకు విస్తరించి ఉండేది . కళింగ దేశ రాణి సుషేణ కుమారులు అయిదుగురు. వారు అంగ, వంగ, కళింగ, వుండ్ర, సుహ్మ రాజ్యాలను స్థాపించారు. ఇది చారిత్రక సత్యం. కళింగ రాజధాని రాజపురి అని మహాభారతంలో చెప్పబడింది. చిత్రాంగ దుడనే కళింగ రాజు కుమార్తెను దుర్యోధనుడు పెళ్లి చేసుకున్నట్లు చరిత్ర చెపుతుంది. కళింగ - ప్రపంచానికి స్పూర్తిపదం. యావద్దేశం అశోకుని సామ్రాజ్య కాంక్షకు తలవగ్గి దాసోహమే సమయంలో స్వేచ్చా స్వాతంత్ర్య అభిలాషతో ప్రాణాలొడ్డి ఎదిరించారు కళింగ ప్రజలు. ప్రపంచ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ప్రాణ నష్టంతో, శోకమే ఎరుగని అశోకునికి శోకమంటే చూపించి మనసు మార్చారు. శాంతికోసం బీజం వేశారు. ధర్మం కోసం మార్గం వేశారు. కళింగ యుద్ధమే లేని నాడు అశోకుని శాంతి సందేశం లేదు. ధర్మ చక్రమూ లేదు. అందుకే కళింగ ప్రజలు స్పూర్తి ప్రధాతలు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా నివశిస్తునప్పటికి ప్రపంచంలో అనేక ప్రాంతాలకు ఉపాధి అవకాశాల కోసం తరలిపోయారు. ఎక్కడున్నా కష్టించి పనిచేసే మనస్తత్వమున్న వీరు తమ ప్రత్యేకత కనబరుస్తూనే ఉంటారు. చారిత్రకంగా విశేష ఖ్యాతి గాంచిన కళింగ ప్రజలు వేల సంవత్సరాల కాలగమనంలో వెనుకబడిపోయారు. అభివృద్ధిని చేజిక్కించుకోవడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారి అభివృద్ధి కోసం, పురోగతి కోసం, సంఘీభావం కోసం స్థాపించబడిందే కళింగమైత్రి పత్రిక మరియు ఈ వెబ్ సైట్. ఇది ఓ సమాచార సాధనం. అంతర్గత అభిప్రాయాల సమాహారం. ప్రపంచంలో ఎక్కడున్నా ఎదురుపడి విశేషాలు అందించే సాంకేతిక సమాచార సమారాధన.